ఉషాపరిణయము ద్వారా MASTER గారు శ్రీమద్భాగవతములో మనకిచ్చిన సందేశము.-
" మనలోని అజ్ఞానము అను చీకటికి లెక్కలేనన్ని బాహువులు ఉంటాయి . వివేకము అను ఉషా కన్యను బయటకు రానీయకుండా అవి అణచి వేస్తూ ఉంటాయి. . భగవంతుని అనుగ్రహము వలన మనలో చక్కని చూపు అను సు -దర్శనము మేల్కొని అజ్ఞానము అను చీకట్లనుతొలగించి నప్పుడు , మనలో ముందు వివేకము ఉదయించి తరువాత జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడు. "
సాధనలో వున్నవారు అంతర్యామి అనుగ్రహము కోసము వేచివుండవలసినదే !
బాణాసురుడు బలిచక్రవర్తి నూరుగురు కుమారులలో పెద్దవాడు. వేయిచేతులు కలవాడు. పరమ శివభక్తుడు. అతని ముద్దుల కూతురు ఉషాకన్య. బాణుని నగరముపేరు శోణపురము. అనగా ఎర్నని నగరము. ఉష అనగా సూర్యుడు ఉదయించుటకు ముందున్న ఉదయ సంధ్యాకాలము.
బాణుడు రాత్రికి అధిదేవత . అతనికి చీకటికిరణములు అను వేయి [అనగా లెక్కలేనన్ని] చేతులు ఉన్నవి.
రాత్రి చివరిభాగములో ఆకాశములో ఎర్రని రంగు వ్యాపిస్తుంది. . అదియే శోణపురము. దానిలోపల అంతఃపురంలో ఉషా కన్య ఉంటుంది . ఉషాదేవి సూర్యుని భార్య.సూర్యుడికి ముందు ఆమె ఉదయించి ,తర్వాత సూర్యునిలో సంగమిస్తుంది. ఉషాదేవి ఉదయించక ముందు ,రాబోవు సూర్యదేవుని సంగమము ఆమెకు భావమయ అనుభూతి. అదే ఉషాకన్యకు [బాణాసురుని కూతురు ] అనిరుద్ధుడు కలలో కనపడడము అనే సన్నివేశము. తరువాత అంతర్యామి పురుషుడుఅయిన వాసుదేవుడు దిక్కులలో వ్యాపించివున్న చక్కనిచూపు అను శక్తిని సు-దర్శనము అను చక్రముగా ప్రయోగించి బాణుని వేయిచేతులు అను చీకటిని నరికివేస్తాడు. తర్వాత సూర్యుడు ఉషా సమేతుడయి శోణపురము నుండి వెలువడి వస్తాడు[అంటే సూర్యోదయము] [అనిరుద్దుడు ప్రద్యుమ్నుని కుమారుడు. ప్రద్యుమ్నుడు శ్రీకృషుని కుమారుడు .అంటే అనిరుద్దుడు శ్రీకృషుని మనుమడు.]
శ్రీకృషుడు బాణాసురుని సంహరించి ,బాణాసురుని కూతురయినఉష అను కన్యను తన మనుమడికి ఇచ్చి వివాహము చేయడము వెనుక వున్న తత్వరహస్యము ఇది . .శివభక్తుడయిన బాణాసురునకు దొరికిన అంతర్యామి[శ్రీకృషుడు ] అనుగ్రహముగూడా ఇదే.శివకేశవులకు బేధములేదు అని చెప్పే సన్నివేశము ఇది.
MASTER CVV NAMASKARAMS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి