31, జనవరి 2015, శనివారం

sekhars question



                  చిరంజీవి sekhar కు నా ఆశిస్సులు .

                      ఇలవేలుపు ..... కుటుంబము కొలిచే దేవుడు లేక దేవత(ఇలవేలుపు దైవము  కాదు )


                   ఆరాధ్య దైవము ....... పూజింప తగిన దైవము,ఆరాధనకు యోగ్య మయిన దైవము
                  దైవము వక్కడే . దేవుడు/దేవతలు అనేకము (హిందువులకు ముక్కోటి దేవతలు)
                   దైవము అందరికి వక్కడే . అతనే ఆరాధనకు అర్హుడు . అతనే పరమేశ్వరుడు,పరబ్రహ్మ,మహావిష్ణువు
                     పోతే, మనము భవుతిక ప్రపంచం లో  మనకు నచ్చిన,మనము మెచ్చిన ,మనము follow
                  అవుతున్న గురువులను  మన ఆరాధ్య దైవాలు గా చెప్పుకుంటాము .
                 ఈ concept  మనకు అర్దము కావాలంటే సృష్టి creation మొదటి నుంచి మనము తెలిసికోవాలి .
                 whats app  లో చోటు సరిపోదు .. కావాలంటే  మెయిల్ పంపుతాను .
                    పోతే ,ప్రతి family over genarations వక దేవుడిని లేక దేవతని ఇంటి దేవతగా పుజించుకొనడం
                  ఆనవాయితి . ముక్కోటి దేవతలలో ఈ దేవత ఆ ఇంటి ఇలవేలుపు అవుతుంది .
               MASTER CVV NAMASKARAMS

  .
                   
                   ,

          

30, జనవరి 2015, శుక్రవారం

vaka clarification...


sriRao  గారికి నమస్కారములు
మీ ప్రశ్న  అసూయ  మరియు  ఈర్ష్య  వకటేనా ?
అసూయ  అనే పదానికి మూల  స్వరూపము తెలిసికొందాము
దత్తాత్రేయుడు మూర్తీభవించిన గురుతత్వము. అత్రి, అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు
త్రిగుణాతీత మయిన చైతన్యము(అత్రి) త్రిగుణముల నుండి వ్యక్త మగుటయే ఆత్రేయుడు .
త్రిగుణములు సమన్వయిం పబడి  సమకోన త్రిభుజముగా ఉండుట అనసూయత్వము .
అంటేత్రిగుణా తీత మయిన చైతన్యము ,సమన్వ ఇమ్పబడిన త్రిగుణముల నుండి వ్యక్య్హమగుట .
లోకమున అసూయ సహజము . దానికి కారణము త్రిగుణముల కలయిక లోని హెచ్చు తగ్గులు .
మూడు  గుణములు సమన్వ ఇంప బడిన వానియందు అసూయ మొదలగు  అరి షట్ వర్గములు  వుండవు .
త్రిగుణముల సామ్యము చెడనివారు అనసూయులు .
త్రిగుణములు .... సత్వము,రజస్సు ,తమస్సు
అరి షట్ వర్గములు .... ఆరుగురు శత్రువులు ... కామ ,క్రోధ ,మోహ ,లోభ ,మద ,మాచ్చర్యము లు
ఈర్ష్య ,అసూయ ,మాచ్చర్యము,  జేలోసి , అన్ని వకే అర్ధాన్ని ఇస్తాయి
అసూయ లేకుండా ఉండడము అంటే త్రిగుణాలకు అతీతుడు గా ఉండడము .
మాస్టర్ CVV NAMASKARAMS





















.

24, జనవరి 2015, శనివారం


http://ramayanainsimplewords.blogspot.com/2012/01/jataayuvu.html

17, జనవరి 2015, శనివారం

10.KARMA SIDDANTHAMULO VAKA PRASNA.....

  10   కర్మ సిద్దాంతము లో  వక ప్రశ్న .....

  సాధకులలో  వకరికి వచ్చిన అనుమానానికి మాస్టారు గారి suggestion  ఇలా వుంది ..
సంచిత కర్మ ,ప్రారబ్ద కర్మ, ఆగామికర్మ .... అని చెప్పుకున్నాము ...
ప్రారబ్దకర్మ అనుభవించక తప్పదు . అంటే accept  చేయక తప్పదు . అయితే వివేకముతో, గురుస్పూర్తి తో ఈ అనుభవాన్ని తగ్గిన్చుకోనవచ్చును . example. ... కడుపు నొప్పి వచ్చింది అనుకోండి . tablet  వేసుకోకుండా  ఉపోషం  వుంటే  nextday కి తగ్గి పోతుంది . గురువు ఈ ఆలోచన ఇస్తాడు .దీన్ని మనము గమనించము .
బలవంతంగా tablet  వేసుకొంటే  temporary  గా తగ్గుతుంది .కాని మళ్ళి  relapse  అవుతుంది . ఇది  తెలిసిగూడా   చాలామంది బలవంతంగా వేసుకొంటారు . దీనికి కారణం  వారి స్వభా వముయొక్క బలము . ఈ స్వభావానికి కారణం పూర్వ జన్మ సుకృతము . ఈ స్వభావము పైకి రాకుండా ,influence  చేయకుండా వుండాలంటే  దైవాన్ని, గురువుని  ఆశ్రయిం చాలి .. .  అప్పుడు ప్రారబ్ద కర్మ  effect  తగ్గుతుంది . ...అంటే గురువు చెప్పింది మనకు మన పరిసరాల ద్వారా  వినబడుతుంది .దయఉంచి  దీన్ని గమనించాలి .  

ఇక పోతే  ఆగామి కర్మ...
మనం  ప్రతిరోజు చేసే పనులలో add  అయ్యే కర్మ ఇది .  మన mind  ఎప్పుడు objectivity  వైపే పనిచేస్తూ వుంటుంది . (ఇంద్రియములు  ఇమ్ద్రియార్ధముల  వైపే పరుగెడుతూ వుంటాయి )
మనము చేయవలసినది వివేకాన్ని ఆశ్ర ఇంచడము . (టచ్ ది intellect ),కర్తవ్యాన్ని రుచికరంగా నిర్వర్తించడము ..
అంటే ఇతరులకు హాని కలుగకుండా వాళ్లకు అవసరమయినది చేసిపెట్టడము . వాళ్ళు కోరుకొన్నది  మాత్రము  కాదు . దయయుంచి దీన్ని గమనిం చండి . ఇట్లా చేస్తే ఆగామి కర్మల నుండి భంధములు  మొలకెత్తవు . తప్పించుకో వచ్చు .
ఇక పోతే  సంచిత కర్మ ... ఇది  మన పూర్వ జన్మల baggage (సంచి )....
ప్రారబ్ద కర్మ , ఆగామి కర్మల  నియంత్రణ వలన (పైన చెప్పినట్లుగా ) సంచిత కర్మ  NEUTRALISE  అవుతుంది .  ( హరించ బడుతుంది ). ...
ప్రస్తుతానికి  దీన్ని  సాధన చేయండి ...
మాస్టర్ CVV  NAMASKARAMS ...