ఆశ్వయుజమాసము
సోదరులందరికి నవరాత్రి శుభాకాంక్షలు
ఆశ్వయుజమాసము మొదలయినది. శరదృతువు ప్రవేశముతో బుద్ధిజీవులందరు అమ్మవారిపూజలు,బొమ్మలకొలువులతో బిజీ,బిజీ గా వుంటారు.
సాధనలోవున్న మనలాంటివారికి ఇలాంటప్పుడు సామాన్యంగా కలిగే ప్రశ్నలు :
1. అసలు ఈ అమ్మ ఎవరు ?
2. అమ్మను ఆశ్వయుజమాసము,శరదృతువులో నే ప్రధానముగా ఎందుకు పూజిస్తారు ?
3. మనకు అమ్మ వైభవము దర్శనము ఇవ్వాలంటే సాధనా పరంగా ఏమిచెయ్యాలి?
ANSWERS:
1. దైవము లేక బ్రహ్మము అవ్యక్తస్వరూపము అని మనము చెప్పుకున్నాము .
అట్టి బ్రహ్మము యొక్క వ్యక్త స్వరూపమే 'అమ్మ'
ఆమెనే శ్రీమాత అనికూడా అంటారు
ఆమెనుండే గుణములు,భూతములు ఏర్పడి సృష్టి అల్లిక జరుగుతూ ఉంటుంది .
అంటే బ్రహ్మము నుండి అమ్మ వ్యక్తమయితే, ఆమె నుండి సృష్టి ఏర్పడుతుంది .
అంటే దైవమునకు,సృష్టికి మధ్య ఉండేది అమ్మ . (శ్రీమాత)
( సత్,చిత్ అని చెప్పుకునే మనకు చిత్ అంటే చైతన్య స్వరూపిణి అమ్మ (శ్రీమాత)
లోకముల మధ్యగూడా 'మధ్యస్థము 'శ్రీమాత
2. అట్లాగే రుతువులలో మధ్యస్థము అయిన శరదృతువు లో ఆశ్వయుజమాసములో అమ్మను ప్రత్యేకంగా
పూజించడం మన ఆచారము.
శరదృతువులో వాతావరణము మధ్యస్థముగా ఉంటుంది . శీతోష్ణము,గాలి,వానలు, సమతుల్యముగా వుండే ఋతువు. ముఖ్యంగా యోగమునకు అనుకూలమయిన కాలము సాధనకు దివ్యమయిన కాలము ఆశ్వయుజము. అందుకే ఆశ్వయుజములో అమ్మవారి ప్రత్యేక పూజలు.
3. ఇక 'అమ్మ' వైభవము,దర్శనము,అనుభూతి గురించి :::
జీవుని స్వభావము సమతుల్యముగా వున్నప్పుడే దేనినైనా అనుభవించగలడు
మనస్వభావము మూడు గుణముల కలయిక . అవి సత్వము,రజస్సు,తమస్సు
రజస్సు ఆడంబరములను సూచిస్తుంది
తమస్సు అశ్రద్దను బయటపెడుతోంది.
యీరెండు అణిగి వుండే మైత్రీ భావమే 'సత్వము'
సమతుల్య స్వభావము అంటే రజస్సు తమస్సు కుడి ఎడమ భుజాలలాగా సత్వము శిరస్సుగా జీవించడము
అట్టి నేర్పు అమ్మ అనుగ్రహము వలననే మనకి కలుగుతుంది.
కాబట్టి అశ్రద్ధ ,ఆడంబరము పక్కనపెట్టి ,ఆహారవిహారాలు,భాషాభావాలు సమతుల్యముగా,మధ్యస్థముగా మలచుకొని ఈ నవరాత్రులలో నిర్మలంగా ఆరాధనా సాగిస్తే సత్వగుణము పెరిగి సాధకునకు అమ్మ వైభవము దర్శనము ఇస్తుంది . అట్టి నేర్పు అమ్మ అనుగ్రహముగా మనము పొందుదముగాక!
మీ సోదరుడు
|
|
Show details

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి