శ్రీమద్భాగవతము దశమ స్కందము 7(contd )
Continued :-[సుదాముడు కోరిన వరము లోని భాగవత విశేషార్ధము] ]
తాపసమందార :----తపస్సాధన చేయు మునీశ్వరులకందరికి కల్పవృక్షమువలె కోరినకోర్కెలు తీర్చువాడా !
నీ పాదకమలసేవయు:-----నాకు కావలసినది నీపాదపద్మములను నిరంతరము సేవించుచుండుట [ఇందులో వక విశేష అర్థముంది . స్వామి తన కన్నుల ఎదుట నిరంతరము బయట ప్రత్యక్షమయి ఉండకదా ! ఆస్వామి పాదములు తన హృదయములో ఉండి , ఆహృదయమే పద్మమయి వికసిస్తే ,అప్పుడు తన హృదయమే శ్రీహరి పాదపద్మములుగా అవుతుంది . అట్లాంటి పాదపద్మములనే సేవించాలి అనిసుదాముడు కోరుకొంటాడు. అంటే స్వామి ఎప్పుడు తనహృదయములో ఉండాలి అని సుదాముని కోరిక. ]
నీపాదార్చకులతోడి నెయ్యమును :-----ఇట్లు తన హృదయములో వున్న శ్రీహరి పాదపద్మముల సేవ నిరంతరము నిలబడి ఉండాలి అంటే ,దానికి అనుకూలమయిన వాతావరణము కావాలి . తనవలెనే శ్రీహరి భక్తులయినవారి స్నేహము లభిస్తే తనలోవున్న స్వామి సాంగత్యము నిలకడగా నిలిస్తుంది. సజ్జన సేవ, సాంగత్యము,సద్గ్రంథ పఠనము,సత్కార్యాచరణము మొదలయినవి భగవంతని స్మరణ నిలబడుటకు ఉండితీ రవలయును.
నితాంత,అపార,భూతదయయును :-------తాను శ్రీహరిని తన హృదయ పద్మములో నిలుపుకొని ,తనవంటివారి భక్తులతో చేరి భజనలు,పూజలు,యజ్ఞములు,చే స్తువున్నంత మాత్రమున సాటిజీవులకు ఏమి ఉపకారము?సర్వ జీవులలోను శ్రీహరి అంశ వున్నదని దర్శించి ,వారితో దయామయుడై ప్రవర్తించుట సాధనలో మరివొకమెట్టు.
ఈ భూతదయ వకనాడు వుండి ,వకనాడు మాయం కాకూడదు. నిరంత రముఉండాలి. పరిమితలు లేకుండా అపారము గాకూడా ఉండాలి. దుష్టులు అని తాను అనుకొన్నవారి మీద గూడ అట్టి దయచూపాలి .అని వరాన్ని కోరుకొంటాడు.
ఇంతకు మించిన ఉత్తమ వరము మరి ఎవ్వరు కోరలేరేమో ?
శ్రీకృష్ణుడు ఆవరాన్ని అనుగ్రహిస్తాడు. బలము,దీర్ఘాయువు, కాంతి,కీర్తి,సంపద కూడా లభించునట్లు అనుగ్రహిస్తాడు.
మనము ఇక్కడ వకవిషయాన్ని గుర్తుచేసుకోవాలి. శ్రీకృష్ణుడు అవతరించుటకు ముందు అతనితోపాటు వకదివ్యప్రణాళిక గూడా దిగివచ్చింది. కలియుగములో కలిసంతరణ వ్యూహముగా కొందరు సిద్ధపురుషుల సూక్ష్మశరీరములను వాహికలుగా స్వీకరించి ,వారి ద్వారా ధర్మసంస్థాపన అను తన ప్రణాళికను కొనసాగించవలెనని గోవిందుని సంకల్పము.
మైత్రేయుడు,ఉద్ధవుడు,దేవాపి,మరువు,విదురుడు, అట్టివారిలో కొందరు. సుదాముడు కూడా ఆకోవకు చందినవాడే. మైత్రేయుడు తన భాద్యతను theosophical society ద్వారా నడిపిస్తున్నారు. అందులో భాగమే మన MASTER గారి బృందం.
కనుక మనమందరము కృతార్థులమే.
జగద్గురువు [THE WORLDTEACHER] శ్రీకృషుడు teacher"s day న మనకు ఇచ్చిన సందేశము ఇది .
స్వస్తి!
కృష్ణం వందే జగద్గురుమ్ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి