19, అక్టోబర్ 2017, గురువారం

SRIMADBHAGAVATHAMU DASAMASCANDAMU 10[CONTD]




సోదర బృందానికి దీపావళి శుభాకాంక్షలు . 
  
   ఎటువంటి గురువు అయినా తనను ఆశ్రయించినవారిని  అనుగ్రహించదలచినపుడు ఏవిధమయిన ప్రదర్శనా   చేయడు. తనకవసరమున్నది కనుక తనకు సహాయము చేయమని మాత్రమే శిష్యులను కోరుతాడు.  గురువుయెడల వున్న భక్తి శ్రద్ధలతో  సేవించుకొన్న శిష్యుడు 
అయన అనుగ్రహానికి నోచుకొంటాడు. తన నుండి గురువుకోరిన ఆ సేవ తనను అనుగ్రహించాడనికి మాత్రమే అని శిష్యునికి కొంతకాలానికిగాని తెలియదు. 
ఆపని శిష్యుని కార్యదీక్షకు , సహనమునకు వక పరీక్ష . సాధన చేయు శిష్యులలో ప్రతివక్కరికి 
ఇటువంటి సన్నివేశ ములు ఎన్నో జరుగుతుంటాయి .గురువుగారిని ఉద్ధరించుచుంటినని కొన్నాళ్ళు,సహాయము చేయుచుంటినని కొన్నాళ్ళు,సహకరించుచుంటినని కొన్నాళ్ళు 
భావన చేయుచు ఒక్కొక్క మెట్టు ఎక్కిన శిష్యుడు గురువు తప్ప మరి ఏమియులేని స్థితికి చేరుకొంటాడు. శ్రీమద్భాగవతము లో ఇటువంటి సన్నివేశ ములలో  మనము  గోవిందుని స్పర్శవలన అనుభూతి చెందిన వారిని చూడగలుగుతాము. 
[శ్రీమద్భాగవతము దశమ scandamu నుండి ]
NAMASKARAMS MASTERS!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి