శ్రీమద్భాగవతము(7)
నీపాదకమలసేవయు
నీపాదార్చకులతోడి నెయ్యమును,నితాం
తాపార భూతదయయును
తాపస మందార "నాకు దయచేయగదే "
ఈ పద్యము మనలో విననివారు ఉండరు . దీని context ,దీనిలోని రహస్యార్థము, మాస్టరుగారు మనకు ఇచ్చినది వక్కసారి మనం చూచి,అనుభూతి చెందగలిగితే మనమందరము మన మాస్టర్ గారి ఆశీస్సులు ఈరోజు అందుకొన్నట్లే.
నారదునిచేత ప్రేరేపింపబడిన కంసుడు ,యాదవులలో సజ్జlనుడు అని పేరుగన్న అక్రూరుని పిలిపించి బృందారణ్యములోని వ్రజగ్రామంలో వున్న బలరామకృషులను తీసుకొనివచ్చి తన మంచితనంతో కంసునిపై శత్రుత్వాన్ని పోగొట్టాలని ప్రార్థిస్తాడు. (కంసుని లోపలి ఆలోచనమాత్రము వేరే ). అక్రూరుడు lబృందావనం చేరుకొని కృష్ణబలరాములను దర్శించుకొంటాడు. కంసుడు ధనుర్యాగమనుపేర మిమ్ములను మధురానగరానికి తీసుకొనిరమ్మని తనను పంపాడు అని చెప్తాడు. కృష్ణబలరాములు అక్రూరునితో బయలుదేరుతారు. దారిలో యమునా జలాలలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అక్రూరుడికి దర్శనము ఇస్తాడు .బలరామకృష్ణులు మధురానగరంలో ప్రవేశించి దారిలో ఎందరినో అనుగ్రహిస్తారు. అందులో వకడు "సుదాముడు " అనే మాలాకారుడు.
సుదాముని ఇంటిలోనికి ప్రవేశించిన బలరామకృష్ణులు అతని ఆతిధ్యాన్ని స్వీకరించి ,పూలదండలు స్వీకరించి ప్రసన్నులై వరమేదైనా కోరుకొమ్మంటారు . అప్పుడు సుదాముడు చెప్పిన మాటలను, కోరినకోరికను ఈపద్యములో పోతనగారు బంధించారు. మనమయితే యే మికోరుకొంటామో? ఇది మనకందరికి వకపరీక్ష,సాధనలో ఎంతవరకు వచ్చాము అని. సుదాముడు పరీక్షలో నెగ్గుతాడు ఈపద్యంతో . మాస్టరు గారు దాని రహస్యాన్ని మనకు ఈ విధంగా చెప్పారు(CONT . )
కృష్ణం వందే జగద్గురుమ్ .
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి