17, జులై 2016, ఆదివారం

MAY CALL DAY 29th may

ఈరోజు MASTER CVV గారి శిష్యు లందరికి పండగరోజు  కారణం మే 29 న మాస్టర్ గారు మొట్టమొదటి
Initiation ఇచ్చిన రోజు 1910లో .
మాస్టర్ గారి మార్గం లో వున్నవాళ్ళు ,ప్రవేశించిన వాళ్ళు ,ముందు నాకేమి కావాలి అని ఆలోచించడము మానెయ్యాలి . మన చుట్టూ ఉండేవాళ్లకు ఏమి కావాలో ఆలోచించాలి . దానితోటి కర్మ అంతా neutralise అయి పోతుంది . నావల్ల వాడు బాగుపడ్డాడు అనే భావన నీకుండకూడదు . ఎదుటివాడికి సహకారము వాడి శ్రేయస్సుకు చేయాలి . ఇట్లా చేస్తూ వుంటే మన పనంతా మాస్టర్ గారే  చేసిపెడతారు . అందుకోసమే ఆయన దిగి వచ్చిన ట్లు గా  మాస్టర్ గారి యోగం గురించి మనము చెప్పుకుంటూ వుంటాము .
MASTER CVV NAMASKARAMS

Sadhanasopanamulu

సోదర బృందానికి  నమస్సుమాంజలులు .
ఎప్పుడయినను ,ఎవరికయినను ,ఎక్కడయినను,ఏదయినను,జరగవచ్చును ."
ఇది మహా వాక్యము. దీనిని గుర్తు ఎరిగి ఉండుట తెలివి
సాధనలో వున్నవారు ఈ సత్యమును అంగీకరించి జీవించి ఉండుటవలన ఆశ్చర్య పడుట,అదిరిపడుట అనునవి లేక స్థిర చిత్తము అలవడగలదు .
దీనికితోడు దైవస్మరణ ,తన పరిసరముల యందు సతతము సాన్నిధ్యము నిచ్చుచున్న అంతర్యామిని ఎరిగివుండుట అనునవి నిశ్చల మయిన మనస్సును కలుగచేయును .
ఇట్లు నిశ్చలమయిన మనస్సు,స్థిరచిత్తము  వున్నవారికి ముందుచూపు కలుగును .వారికి దివ్యప్రణాళిక కు
సంబందించిన సందేశములు అందుచుండును. (పరిసరముల ద్వారా )
ఇది సాధన యొక్క మొదటి సోపానము.
సశేషము