23, మే 2017, మంగళవారం


21, మే 2017, ఆదివారం

Chi krishnudi prasnaku vaka vivarana



The answer to your question is simple but I shall deal it a little latter.  First let us analyse  what

THOUGHT consists of. In the context of Sadhana.  The word thought is derived from the word MIND  . The definition of mind is 'flow of thoughts'. In Sanskrit it is ' Vrithi pravaha iti mañaha!'
The question now is how to control Mind/thoughts.
Basically thought is not yours. It is coming from somewhere for which you are only an observer.

తెలుగులో చెప్పుకుంటే బాగా అర్ధమవుతుంది. అన్ని ఆలోచనలకూ మూలస్థానము హృదయము (గుండె కాదు)
ఇది ఛాతికి కుడివైపున ఉంటుంది. దీనినే 'ఆత్మ' అంటారు. మనస్సు ఆత్మను కప్పివేసి ఉంచుతుంది. ఈ ఆలోచనలకు మూలము నీ past actions either performed in this life or previous life.
మన సాధన అంతా  మన నిజస్వరూపమయిన ఆత్మను కప్పివేసిన ఆలోచనలను (మనస్సును) తొలగించుకోవడము. సాధన కొనసాగుతువుంటే నేను ఎవరు ?అన్న ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది. నేను అంటే ' శరీరము ,మనస్సు' కాదుఅని తెలుస్తుంది. నేను ఆత్మను అని realise అవుతాము. దీనినే ఆత్మానుభవము అంటారు.నేను శరీరాన్ని అనుకున్నంతవరకు  ఏదోవొక శరీరాన్ని(జన్మను) మోస్తూవుండవలసినదే.
ఆత్మానుభవమువలన పునర్ జన్మ ఆగిపోతుంది. కాబట్టి దీనికంతటికి సమాధానము మనస్సు లేక ఆలోచనలను నశింపచేసుకోవడము.
అదియెట్లా అని నీప్రస్తుత ప్రశ్న .
శ్వాసమీద  ఫోకస్ చేయడము దీనికి  ఇవ్వబడిన మార్గము. శ్వాసమీద ఫోకస్ చేస్తూవున్నప్పుడు వచ్చే ఆలోచనలను నియంత్రించ గూడదు . (do not control thoughts. ) అవి మననుండి వచ్చినవి కాదు కాబట్టి

వాటివెంటనే  వానిని (Observe) చేసు కుంటూ వెళ్ళాలి . ఆ ఆలోచనలకు మనము రియాక్ట్ కాగూడదు.
Analyse,react,contribute,add,participate- ఏది చేయకూడదు. అప్పుడు అవి automatic గ వాటి సోర్స్ అయినా ఆత్మ లో కలసి కిల్ చేయబడతాయి . మరల మనము మన శ్వాస మీదకు రావాలి . మరల మరిఒక
ఆలోచన వచ్చేలోపు మనము'ధ్యానము'నకు  ఉపక్రమించాలి. అప్పుడు రెండు ఆలోచనల మధ్య space
పెరుగుతుంది. మెల్లగా ఆలోచనలు ఆగిపోతాయి. నీ స్వస్వరూపము (నేను ఆత్మను అన్న భావన) నీకు దొరుకుతుంది.
ధ్యానము అనే పదాన్ని ఇక్కడ వాడాము . దాన్నిగూడ చెబుతాను. నీవు ఉచ్వాస,నిశ్వాసలు చేస్తున్నప్పుడు
వక  మంత్రముతో ప్రయాణము చేయడము. ఉదాహరణకు 'సోహం' అనే మంత్రం. ప్రాణ శక్తిని లోనికి పిల్చున పుడు
సో  అని మనస్సుతో అంటూ పీల్చాలి. వదులుతున్నప్పుడు హమ్  అంటూ మెల్లగా పలుకుతూ వదలాలి.
అప్పుడు నీ ఆలోచనల మధ్య అంతరం పెరుగుతుంది.  నిరంతరత్వము సాధ్యమవుతుంది. దీనికి చాలా ప్రయత్నమూ కావలి. ఆత్మసాధన అంటే ఇదే. మెల్లగా ప్రయత్నముచేయి నీకే తెలుస్తుంది.
 WHO AM I?
I AM A SOUL. BUT I HAVE A BODY
అన్న సత్యానికి ఇది వక పరిచయము
ఇదే ఆత్మానుభూతి .
స్వస్తి
NAMASKARAMA MASTER



19, మే 2017, శుక్రవారం

Sadhana (contd). Pranayamamu

 ప్రాణాయామము

ప్రాణాయామము అనగా ప్రాణము యమింపబడుట. ప్రాణము యమింపబడుటకు శ్వాసనిబద్ధము కావలెను.
శ్వాసను క్రమబద్ధముగా నిర్వర్తించుటకు ,ఉఛ్వాసముతోపాటు మనసు అంతర్ముఖముగా పయనించి ఉచ్వాస కొనకు చేరవలెను. ఉచ్వాసకొనన  నిశ్వాస ప్రారంభమగును. నిశ్వాసను మరల అనుసరించుచు మనసు నిశ్వాస కొనను చేరవలెను. ఇట్లు మనసును శ్వాసపై లగ్నము చేయవలెను. ఈ  అభ్యాసము మొదటిమెట్టు.
మనసును శ్వాసపై లగ్నము చేసి ' శ్వాసను నెమ్మదిగా పీల్చుట ' అభ్యాసమున రెండవమెట్టు.
శ్వాసను నెమ్మదిగను, పూర్ణముగను,పీల్చుట వదులుట ప్రతిశ్వాసయందు నిర్వర్తింపబడుట  మూడవమెట్టు.
ఈ  మూడవనియమముననే  శ్వాస క్రమబద్ధమగును. సృష్టియందలి క్రమమే క్రతువు. శ్వాసను క్రమబద్దము
చేయుట అనగా వక శ్వాసకు ఎంతకాలము పట్టునో, తరువాతిశ్వాసలకుగూడ అంతేకాలముపట్టవలెను.
ఇది నాలుగవ నియమము. ప్రతి దినము సాధకుని సౌకర్యమునుబట్టి  వకేకాలమున  ప్రాణాయామము నిర్వర్తించుట అయిదవ నియమము. ప్రతి మూడు శ్వాసలు వక  విభాగముగా భావించుచు
తొమ్మిది విభాగములుగా ఇరువదిఏడు  శ్వాసలు నిర్వర్తించుకొనుట వకశ్వాస విభాగముగా గుర్తించవలెను.
క్రమముగా దీనిని మూడురెట్లు పెంచుకొనవచ్చు ను. (27*3=81) . ఇచట కాలమునకు శ్వాసలే కొలతగాని,
గడియారముకాదు.
ఇది ప్రాణాయామయజ్ఞమునకు వక  పరిచయము.
BY MASTER K P K
NAMASKARAMS MASTER(4/70)









17, మే 2017, బుధవారం

Sadhana(contd). 3. Antharmukhudu




సాధన ---అంతర్ముఖుడు


మానవుని ప్రజ్ఞ అంతర్ముఖ మగుటకు  ప్రధానమగు ఉపాయము  శ్వాసను గమనించుట.  శ్వాసపై మనసు లగ్నము చేయుట.  శ్వాసమార్గము, బహిర్ముఖమయిన మనోప్రజ్ఞను  అంతర్ముఖము  చేయుటకు

ఉపయోగపడును. శ్వాసపై మనసు నిలుపుటవలన  శ్వాసననుసరించు  మనసు  శ్వాస పుట్టుక స్థానమునకు

పయనించును. క్రమముగా మనసు స్పందన ప్రక్రియను చేరును. మనసు స్పందనమును గమనించుటయందు

ఏకాగ్రత కలిగినకొద్దీ, ప్రాణాపానములు సమన్వయింపబడి ఉదానప్రాణము ద్వారమున అంతరంగమున

ఊర్ధ్వ ముఖమై జనును. భృమద్యమును చేరును. భృమద్యమును  నాసికాకేంద్రముగా కూడా తెలుపుదురు.

అచ్చట అంతర్ముఖుడై  చరించుచుండును.

జ్ఞానయోగమను అధ్యాయమున  నిష్కామకర్మను నిర్వర్తించుచు మనము చేయవలసిన పండ్రెండు రకములగు

యజ్ఞములను భగవానుడు భగవద్గీత యందు మనకు భోదించినాడు . అందలి ప్రాణాయామ యజ్ఞమునకు ఇదివక  పరిచయము.
From MASTER K P K(5/72)
NAMASKARAMS MASTER









15, మే 2017, సోమవారం

Sadhana(contd)



సాధన

సాధనలో భౌతికముగాగాని ,మనస్సతోగాని దిక్కులు చూడరాదు . శ్వాసను స్మరించునపుడు నాసికాగ్రమును స్మరించవలెను  అచ్చటనుండి  శ్వాసతో లోనికి పోవుట,వచ్చుటలతో ప్రాణాయామమేర్పడును.

మనస్సు  శ్వాశయందు నిలుచుటలో  ప్రత్యాహార మేర్పడును. మనస్సు,శ్వాస  ఏక మగుటతో  ధారణ మేర్పడును.  బాహ్యము,అంతరము అను ప్రజ్ఞలు కరగి కలసి పోవుటతో అంతర్యామిత్వము ఏర్పడును. ఇదియే ధ్యాన స్థితి . ఆ స్థితిలో  సర్వకార్యములు ఆచరింపబడుటలో సమాధిస్థితి ఏర్పడును.

మనకు తెలిసిన యమ ,నియమములు వీటితో జతచేసిన పతంజలి మహర్షి మనకందించిన అష్టాంగయోగము
మనకు పరిచయమము కాగలదు .
(ఇంద్రియములను శిక్షణ పెట్టుట---యమము . మనస్సును శిక్షణ పెట్టునది  నియమము )
ఈస్థితిలో ప్రశాంతమయిన ఆత్మస్థితి ఉండును .

From
MANDRAGEETHA BY MASTER E K
NAMASKARAMS MASTER

14, మే 2017, ఆదివారం

Atmasadhanaa sutramulu

ఆత్మసాధన
హృదయ స్పందనము మనసుచే గుర్తించు చున్నంత వరకు మనసు హృదయమున నిలుపబడును. హృదయము నుండి మెల్లగా స్పందనల అనుసరించుచు ఊ ర్ధ్వ ముగా  ధ్యానము చేసినచో  స్పందనము ప్రజ్ఞ  భృమద్యమున  నిలుచును. అట్లు నిలచిన మనసు క్రమముగా వెలుగు మండలమున ఆసక్తి గొనుచుండగా ,శ్వాస స్పందనములో సూక్ష్మమై  శమించును.
అట్టి స్థితిలో ఓంకారమును ప్రజ్ఞతో కూర్చి  మానసిక ఉచ్చారణ పూర్వకముగా శిరస్సుపైకి ఊర్ధ్వముగా  ఉచ్చరింపుము . అపుడు ప్రజ్ఞ మోక్షము నొందును . మరియొకటి అను ప్రజ్ఞ ఉండదు . అన్యముండక  అనన్య ముండును.
ఇది నిత్యమూ అభ్యసించువాడు  'ఆత్మ సంయమము '  పొందినవాడగును.

MASTER KPK