5, డిసెంబర్ 2014, శుక్రవారం




3, డిసెంబర్ 2014, బుధవారం

9 .karma---daani parichayamu

                                                       శ్రీ గురుభ్యోనమః
శ్రీ మార్గ శీర్ష్య పౌర్ణమి ,శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్బం గా మన సాధక మిత్రులు అందరికి శుభాకాంక్షలు .
లోకాలను సృష్టించి ,లోక ధర్మాలను ఏర్పరచి ,శాశ్వత ఆనందమును అనుభవించ డానికై  దైవము మనలను ఈ లోకములో ప్రవేశ పెట్టాడు . మనము శాశ్వత ఆనందము అనుభవించాలి అంటే మనకు మన నిజ స్థితి తెలియాలి ,ధర్మమూ తెలియాలి . ఇవి మనకు తెలియాలి అంటే  చెప్పడానికి  మనకు వక ఉపాద్యాయుడు కావాలి కదా . దైవమే మరల అట్టి ఉపాధ్యాయుడుగా , గురువుగా, దిగివచ్చి  మనకు (జీవులకు) ధర్మ అనుష్టాన బుద్ధి, నిజతత్వ విచారణ ఈ లోకములో నేర్పుచున్నాడు . ఈ సృష్టి లోని మూడు లోకములలో ను గల అట్టి గురుతత్వమే (ఉపాధ్యాయుడే) శ్రీ దత్తాత్రేయుడు . శ్రీ ధత్రాత్రేయుడు మూలగురువు . సృష్టి అందలి ఏ గురువైనను యీతని
అంశయే . ఇట్టి గురుతత్వాన్ని ఆశ్ర ఇంచడం   ద్వారా మనము మన సంచిత   కర్మలను విచిత్రముగా
 దాటగల మని  శ్రీ దత్తాత్రేయజయంతి సందర్భము గా మనకు మనగురువుల ఈ క్రింది సందేశము . సత్సాధకులము అయిన మనము దీన్ని ఓపిక తో పరిసీలింతుము గాక .    
                                     




  9.     కర్మ---దాని పరిచయము

నేను ఇవాళ మాట్లాడుతున్నది కర్మసిద్దాన్థము మీద నమ్మకమున్నవాండ్లకు  మాత్రమే .
మేము వక చిన్న పల్లెటూరి వాసులం . highschool  వరకు అదే atmosphere లోనే పెరిగాను. మా వూరులో  బాగా వేదము చదువుకున్న పండితులు వుండే వారు . వాళ్ళ మాటలు నేను శ్రద్ధగా వింటూ ఉండేవాడిని . వాళ్ళ మాటలలో వకరోజు "వరే వాళ్ళ ఇంట్లో రెండుమూడు తరాల నుండి అందరూ  యజ్ఞాలు, యాగాలు, దానాలు  చేసినవారే .  తెలిసి ఎవ్వరికీ చెడు చేయలేదు . వాళ్లకు ఇంత కష్టము ఎందుకు వచిందో? ... వాళ్ళ ప్రారబ్ద కర్మ .... "
అంటూ వుంటే ఇది ఏమిటో అనుకొనే వాడిని .గురువు ద్వారా దీనిని గురించి  నాకు తెలిసిన వివరణ మీకు చెబుతాను .
వర్ణాశ్రమ ధర్మక్రిత్యములకు ,శరీర పోషనమునకు ,సంబందించిన శాస్త్ర విహిత కర్మలను ఆసక్తి, ఫలేచ్చ ,మమకారము,అహంకారము  త్యజించి చేయుటను కర్తవ్య కర్మలు అంటారు అని చెప్పుకున్నాము .
మనము రొజూ చేసే కర్మలు, మన పూర్వజన్మ సంస్కారము యొక్క స్వభావము ను బట్టి,మనచేత చేయించ బడుతూ వుంటాయి . కట్టె మండుతున్నప్పుడు పొగ ఎలా వస్తుందో ,మనము కర్మలు ఆచరించే టప్పుడు అనేక వాసనలు (పలితాలు) మన స్వభావానికి తోడవుతూ వుంటాయి . అవి మూడు విధాలుగా వుంటాయి .

1. సంచిత కర్మ వాసనలు   2. ప్రారబ్ద కర్మ వాసనలు 3. ఆగామి కర్మ వాసనలు
1.  సంచిత కర్మ :--accumilated karmas over past janmaas.
2. ప్రారబ్ద కర్మ :----karma allotted for this current janma out of total sanchitha karma
3. ఆగామి కర్మ:---current janma additions  ఈ జన్మలో కూడ పెట్టుకున్నట్టివి

ఫై కర్మల వాసనల నివారణ మార్గములు :---

ప్రారబ్ద కర్మను accept  చేయుట ద్వారా  సంచిత కర్మ కొంత  నిర్మూలన అగును . గురువును, దైవాన్ని ,ఆశ్రయించి సంచిత కర్మను పూర్తిగా  పరిష్క రించు కొనవచ్చును .మిత్రులు దీనిని గమనించ ప్రార్ధన .

నిష్కామ కర్మలు నిర్వర్తించుట నేర్చు కొని (నియత కర్మలు లేక ధర్మశాస్త్ర విహిత కర్మలు ) ఈ జన్మలో ఆగామి కర్మను నివారించు కోన వచ్చును
కాని, ప్రారబ్ద కర్మను మాత్రము అనుభవించ వలసినదే (law of acceptance) (మా వూరి వారి సందిగ్దానికి సమాధానము)
దైవాన్నిగురువు ద్వారా ఆశ్రయించుట వలనసంచిత  కర్మమును విచిత్రముగా దాటగలరు అని భ్రుక్త రహిత తారక రాజయోగము న మనకు మన గురువులు తెలియచేయుచున్నారు . కర్మను హరించుట యే గాని ,దానిని వాయిదా వేయుట గాని ,త్వరితముగా అనుభవింప చేయుట గాని వుండదు . హరించుటకు మార్గము "భ్రుక్త రహిత తారక రాజయోగము మాత్రామే .
MASTER C V V NAMASKARAMS....




REF -----SRIDSTTATREYUDU BY MASTER K P K



7C.MANAMU TELIVIGALAVAALLAMU CONTD

7C. మనధర్మమేమిటో  మనకు తెలిసేది ఎట్లా?

మనధర్మము మనకర్తవ్యము రూపమున మనకు ఎప్పటికప్పుడు కనబడుతూ వినబడుతూ వుంటుంది .

కర్తవ్యము కాలము రూపమున ప్రస్తుతింప బడుతూ వుంటుంది . (అంటే మనచుట్టుపక్కల వుండే మనుషుల

ద్వారా,పరిసరాల ద్వారా ). కాలము మనజీవితములో సన్నివేసములుగా , ద్వందములుగా (అంటే సౌకర్యము-

అసౌకర్యము,  సుఖము -dukkamu ,జయము-అపజయము etc ) అందుతూ వుంటుంది . మనపనిఅల్లా

ప్రస్తుతము అందించు కర్తవ్యమును pickup  చెసుకోడం . ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము


మనమనస్సును బుద్ధితో లయంచేసి present లో ఉంచితే జరుగుతున్ది.

వక్కనిముశం ఆగండి!  ఇప్పుడుమీ mind ఎక్కడ ఉంది?........ అది past లోనో, future లోనో వుంటుంది . karektena

దీనిని ఆపి presentlo పెట్టండి .కొమ్చమ్ కష్టము . మైండ్ వక కోతి  లాంటిది . దాన్ని పట్టుకొని present లో

పెట్టాలంటే మీ ANTENNA OPEN చేసుకొని మీ TV ని (బుధిని) ఆన్ చేసుకొని కూర్చొని వుండాలి .

ఉండనివ్వదు . ఉండనివ్వాలి అంటే దానికి పనిచేప్పాలి . ఏమిటిఆపని ?మీ మనస్సును మీ ఉచ్వాస,నిస్వాసాల


మీద ,హృదయస్పందన మీద ,వాక్కు(ఉచ్చారణ )మీద వుంచండి . వర్తమానములోనే ఉండడానికి

ప్రయత్నించండి.


అప్పుడు మీ ధర్మము ,కర్తవ్యము, మీకు తెలుస్తుంది . మీ చుట్టూ వుండే వాళ్ళ ద్వారానే,పరిసరాల ద్వారానే మీకు



వినబడుతుంది నన్ను నమ్మండి . దీన్ని practicecheyandi . మీమీ అనుభవాలను వక డైరీ లో వ్రాసుకోండి .
మీకు ఇవ్వబడిన కర్తవ్యాన్ని ధర్మమార్గములోనే ఆచరించండి . (అంటే నీకు ఇవ్వబడిన కర్తవ్యాన్ని ఎదుటివాడికి హానిజరగాకుండా నిర్వర్తిమ్చండి . )
యోగము, తత్వము, దైవము వీటిని గురించి రేపు చూద్దాము
MASTER CVV NAMASKARAMS