19, ఆగస్టు 2018, ఆదివారం

Mana Ramudu...2

దశరధుడు అతనిని అర్గ్యపాద్యాదులతో పూజించి ఆహ్వానించాడు. సంతోషించిన విశ్వామిత్రుడు దశరధుని క్షేమసమాచారాలు అడిగి గాయత్రీమంత్రము యొక్క విశిష్టతను తెలిపేటందుకు పూనుకొన్నాడు. అదేసమయంలో వసిష్ఠులవారు వచ్చారు. వసిష్ఠుడు,విశ్వామిత్రుడు కలుసుకున్న శుభసమయములో శ్రీరాముడు అక్కడికి ప్రవేశిస్తాడు. రామ,లక్ష్మణుల దర్శనం జరుగుతుంది. విశ్వామిత్రుడు సూర్యఅంతర్వర్తి అయిన నారాయునినిచూచి తన హృదయంలో ఆధర్మస్వరూపాన్ని ప్రతిష్టించుకొంటాడు. చూడండి!
ఓంకారమే వసిష్ఠుడు ,గాయత్రీమంత్రము విశ్వామిత్రుడు. ఆఇద్దరు కలిసినప్పుడు మాత్రమే రామునిదర్శనము జరుగుతుంది. ఇది 'KEY'. గమనించండి.
మనంకూడా ప్రతిరోజు ఓంకారముతోకూడిన గాయత్రీమంత్రము జపం చేసుకొంటే మనలోనే సహస్రారకమలములో వున్న శ్రీరాముడిని మనం చూడగలుగుతాము. కార్యక్రమానికి రానివాళ్లు ఆవేదన చెందవద్దు. వాల్మీకిమహర్షి మనకిచ్చిన పైసదుపాయాన్ని ప్రయత్నంచేయండి.
దైవదర్శన ప్రాప్తిరస్తు,,!
స్వస్తి!


mana ramudu

బృంద సభ్యులకు శుభాకాంక్షలు
రాముడు ఆహ్వానము మేరకు విచ్చేసిన బంధువులంతా సీతాలక్ష్మణ సమేత శ్రీరామ,హనుమ మరియు పెరుమాళ్ళు యొక్క ప్రతిష్టా కార్యక్రమం లో పాల్గొని ఆనందాన్ని పొందారు .. ఆ దైవస్వరూపాన్ని మనస్సులో ప్రతిష్ఠించుకొని ఎల్లప్పుడూ ఆ అనుభూతిలో మునిగి తేలుతున్నారు
అవకాశాలులేక రాలేకపోయినవారు ,వచ్చినవారి అనుభూతిని ఆస్వాదిస్తూ ,చూడలేకపోయామే అని కొంత కొరతను మనస్సులో నింపుకొన్నారు. అట్టివారికి మాస్టరుగారు ప్రతిపాదించిన అంశమును మీకు తెలుపుకొంటాను.
రామలక్ష్మణులకు 16 సంవత్సరములు వచ్చేసరికి అన్నివిద్యలలోను పరిపూర్ణత చెందారు. తన నలుగురు కుమారులకు దశరథమహారాజు విద్యాబ్యాసానికి వసిష్ఠుణ్ణి నియమించాడు. సకలవిద్యలలో ఆనలుగురు ఆరితేరినవారయ్యారు.
దేవకళ్యాణార్ధము విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞానికి రాక్షసులవల్ల ఆటంకాలు కలగడంవల్ల అతడు దశరధుడివద్దకు వచ్చాడు.   Contd