శ్రీమద్భాగవతము 10వ SCANDAMU (6COND )
జరగనున్నది తెలిసి, పైగా అది దైవనిర్ణయమని కూడా తెలిసినప్పుడు తానేమి చేయవలెను?
అష్టమ గర్భము కంసుని చంపుట దైవనిర్ణయము కనుక చేయవలసినదేదో దైవమే చేయునని
చేతులు ముడుచుకొని కూరుచుండుటయా ?అట్లయిన కంసుడు దేవకిని చంపచూచినపుడు
వసుదేవుడు నిర్ణయమును దైవమునకు వదిలి కూర్చుని ఉండ వచ్చునుగదా ?కానీ ,వసుదేవుడు అట్లా చేయలేదు.{ తన కర్తవ్యాన్ని (మానవప్రయత్నము బుద్ధిని వాడి ) నిర్వర్తించాడు. కంసుని వప్పించి భార్యను విడిపించుకొంటాడు. }
అష్టమ గర్భమున పుట్టవలెనన్న దేవకీ బతికి ఉండవలెను. కనుక,కంసునితో, పుట్టిన ప్రతివానిని తనకిచ్చెదనని తెలిపి ,వసుదేవుడు తన భార్యను రక్షించుకొనెను .
దైవ నిర్ణయములు కూడా చాలావరకు మానవులద్వారానే జరగవలసియుండును . అనగా దైవ సంకల్పము అనుసరించి మానవుని బుద్ధి పనిచేయవలెను. మానవుని బుద్ధి సహకరించకపోయినను, దైవసంకల్పము ఏదోవొక విధముగా కార్యరూపము ధరించును.
కానీ అట్టి సందర్భములలో మానవుడు మాత్రమూ అప్రయోజకుడై అధోగతిపాలగును.
జరగవలసింది జరిగి తీరునని నిష్క్రియాపరులై జీవించువారు లక్షలకొలది వున్నారు.
దైవకార్యముకాని, తన వ్యక్తిగత కార్యముకానీ మానవుడు తన బుద్ధి బలమునువాడి
కర్తవ్యమును నిర్వర్తించవలెను. ఇట్లు వసుదేవుడు తన బుద్ధిబలముచేతను,కాలము కలిసివచ్చుట చేతను తన కర్తవ్యమును నిర్వహించి తన భార్యను రక్షించుకొనెను.
[జ్యోతిర్ శాస్త్రము తెలిసినవారికి ఇక్కడ ఇంకొక రహస్యముకూడా తెలియును ]
సరే, కంసుడు దేవకిని వదిలిపెట్టినాగూడా ,తన స్వభావంతోకూడిన భయముతో అనేక పాపకర్మలు చేయుచునే ఉండెను. కంసుడు మరణించుట అనునది కాలపురుషుని ప్రణాళికలో వకభాగము . ప్రణాళిక కాలపురుషునిది అయినను , కంసుడు తన మృతువును తా నే ఆహ్వానించుకొనవలెను. దైవము కంసునిచేత పాపములు చేయించనక్కరలేదు. తనస్వభావమే
కారణముగా కంసుడు పాపములు ఆచరిస్తాడు. వాణి స్వభావమే కాలపురుషుని పాశమై వానిని భాధించును. కాలపురుషుని ప్రణాళిక వక వైపునా ,వ్యక్తి స్వభావము మరివొకవైపునా ,
పడుగు ,పేకలుగా కాలమను వస్త్రము నేయబడుచుండును. [స్వ -భావము ను గురించి మనము
పాతపాఠాలలొ చెప్పుకొన్నాము] యీ సత్యము వక్కటే ఎన్నో సృష్టి రహస్యములను ,కాలస్వభావములోని రహస్యములను, మానవస్వభావములోని రహస్యములను,విప్పి చెప్పును .
కృష్ణంవందే జగద్గురుమ్!
MASTER CVV NAMASKARAMS