9, ఆగస్టు 2017, బుధవారం

SRIMADBHAGAVATHAMU CONTO 10(CONTD) 5



   శ్రీగురుభ్యోనమః
అందరు బాగా చదివినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాల అనుమానాలు వస్తున్నాయి.
వక సోదరుని సందేహము.
ప్రశ్న:మనమందరము నరులమేకదా ?
           నరుడు అంటే దిగివచ్చిన నారాయణ ప్రజ్ఞ అని చెప్పారు. శ్రీకృష్ణుడు కూడా భూలోకంలో అవతరించిన మానవరూపముకదా? గోపగోపికలతో కలిసి ఆడాడు, పాడాడు . అయినప్పుడు మనకు,ఆయనకు   తేడా ఏమిటి?
మాస్టరుగారి సమాధానము :
         ఇది శ్రీకృష్ణుని జన్మ రహస్యమునకు సంబంధి Oచిన ప్రశ్న.
మనమందరము ఈ సృష్టిలో శరీరము ధరించిన నరునితత్వముగల జీవులం. మాయాశక్తి (అమ్మవారు) ఇస్రుష్టిని ప్రారంభించినపుడు ఆమెముందు నారాయణుని నుండి వెలువడి ,త్రిగుణములను స్వీకరించి,కాలముతోకలిసి సృష్టిని ప్రారంభించును. అంటే మనము త్రిగుణములకు లోబడి జీవిస్తూ ఉంటాము. మనము మనతల్లి గర్భమునుండి,త్రిగుణములతోకలసి,కాలము లేక దైవము అను తత్వము శరీరంలోపల ఉండగా ఈ సృస్టిలోకి వస్తాము. మరి శ్రీకృష్ణుని జన్మ విచిత్రము చూ డండి. అయన తల్లి కడుపునుండి ప్రసవించబడినచో ఆ  శరీరమునకు కొన్ని ప్రకృతి సంబంధ మయిన భౌతిక భందములు ఉండును. అట్లుగాక దేవకీదేవి ప్రసవించినంతనే చతుర్భాహుడయిన విష్ణుమూర్తి బాలుని వయస్సులో వున్న శ్రీహరి అయి వారికి  దర్శనమిచ్చెను. ఆ తరువాత ఆ దివ్యరూపము అంతర్ధానమయి పసిబాలుని శరీరము కనిపించెను. అంటే ఆ బాలుని శరీరము తల్లి గర్భములో
సమకూర్చుకున్న ధాతువుల స్థానములో దివ్యాణు వులతో నిర్మాణమయిన దివ్యధాతువులు
సమకూడి దివ్యరూపముగా మారెను.
అందువలననే బాలకృషుడు ప్రకృతిలో వున్న సమస్త భూతములపై ,జీవరాసులపై ,దేవతాగణములపై ఆధిపత్యము సాధించెను. ఉదాహరణకు పురిటికందుగా వున్నప్పుడే పూతన అను రాక్షసుని సంహరించుట మొదటి నిదర్శనము. శ్రీకృష్ణుడు పదమూడవ సంవత్సరము లోపలనే సర్వప్రకృతి పరిమితులకు అతీతుడుగా నిలిచి దివ్యకార్యములను సాధించెను.
ఇది సృష్టి ప్రణాళికలో వక భాగము.
అంటే శ్రీకృషునితో జీవించిన సహచరులు అందరు ప్రకృతికి లోబడినవారే (వక్క బలరాముడు తప్ప) శ్రీకృషుడు మాత్రమూ అవతార ప్రయోజనమునకై జీవిత కాలమంతయు దివ్యలీలా మయుడుగా జీవించిన /జీవించుచున్న అవతారమూర్తి.
శ్రీకృష్ణుడు ప్రకృతి ధర్మములకు పూర్తిగా అతీతుడు. మనము ప్రకృతి ధర్మములకు (సత్వ,రజస్సు,తమస్సు ) కట్టుబడిన వారము.
ఇది మ్మన మిత్రుని ప్రశ్నకు సమాధానము.
ఇది మన మాస్టరుగారు మనకు ప్రతిపాదించిన శ్రీకృషుని జన్మరహస్యము.
కృష్ణం వందే జగద్గురుమ్ !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి