3, ఆగస్టు 2017, గురువారం

SRIMADBHAGAVATHAMU 10TH SCANDAMU(contd) 4



శ్రీగురుభ్యోనమః!

శ్రీహరి (పరబ్రహ్మ,పరమాత్మ,నారాయణ ) కి రెండు రూపములు . వకటి పురుష స్వరూపము,రెండు కాలస్వరూపము. (క్రిందటి పోస్టులో చెప్పుకున్నాము )
మాయాశక్తి నారాయణుని అంశమును స్వీకరించి "నరతత్వమును రూపొందించును.( అసలు సృష్టి ప్రారంభములో యోగనిద్రలోనున్న నారాయణుని నుండి యోగమాయ వెలువడి ,కాలముతోకలిసి,త్రిగుణములను స్వీకరించి సృష్టిని  ప్రారంబించును.)
నరుడు అనగా దిగివచ్చిన నారాయణ ప్రజ్ఞ .
మరలనరులలో రెండు తత్వములు ఉండును.
శరీరమును ధరించిన నరుని తత్వ మును జీవుడు అందురు. ఆ శరీరము లోపల కాలమను తత్వము పనిచేయుచుండును. దానినే " దైవము" అని అందురు .
దైవము వేరు దేవుడు వేరు.
ఇప్పుడు వరసగా చుడండి
నారాయణుడు, నరుడు,జీవుడు,కాలము లెకదైవము
జీవుడు +దైవము =నరుడు  OR
 శరీరము +లోపలి కాలము లేక దైవము=నరుడు (దిగివచ్చిన నారాయణ ప్రజ్ఞ)
ఈ  కాన్సెప్ట్ పూర్తిగా అర్ధముచేసికోవాలి .

మాయాశక్తి అనే వకపదము వాడాము .. ఈమెయే వ్యక్త స్వరూపఅయిన  అమ్మవారు
నారాయణుడు అవ్యక్త స్వరూపుడు.
అమ్మ నారాయణుని అంశ స్వీకరించి ,కాలము మరియు త్రిగుణములతో కలిపి నరతత్వమును (సృష్టిని )రూపొందించును అని పైన చెప్పబడినది. CONFUSE కాకుండా మరల వక్కసారి
పైనించి క్రిందికి చదవండి.సృష్టి ఎలా వచ్చినదో అర్ధమవుతుంది.
స్వస్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి