16, ఆగస్టు 2017, బుధవారం

srimadbhagavathamu 10thCANTO[contd] (6)




    శ్రీమద్భాగవతము దసమస్కందము {contd }(6)

"కాలము" అనే పదము మనముముందుపాఠాలలో వాడాము. కాలాన్ని గురించి పూర్తి అవగాహన
కావాలి అంటే మనము కంస, వసుదేవుల సంభాషణం లోని వసుదేవుని మనస్తత్వాన్ని పరిశీలించాలి. ఈ సంభాషణలోని  కాలమునుగూర్చిన రహస్య ప్రకాశాన్ని మన మాస్టరుగారు ఇట్లా ఇస్తారు. (ఇందులో పునర్జన్మ,కర్మసిద్దాంతము లకు  చక్కటి వివరణలు కూడా వున్నాయి. అవి ఇంకొకసారి చెప్పుకొందాము. )

కంసుడు ఆకాశవాణి మాటలు విని,ఉగ్రరూపుడయి ,ప్రాణభయంతో సోదరి అని కూడా ఆలోచించకుండా దేవకీదేవిని రధమునుండి క్రిందికి లాగి ఖడ్గముతో ఆమెను నరకబోతాడు. అప్పుడు దేవకీభర్తయైన వసుదేవుని  మనస్సులోని ఈక్రింది ఆలోచనలు కాలమును గూర్చి మనకు తెలియపరుస్తాయి.
నారాయణుని నుండి వెలువడిన మాయ (వ్యక్త స్వరూపమయిన అమ్మవారు లేక త్రిగుణాత్మకమయిన ప్రకృతి ) కాలముతో కలసి సృష్టిని ప్రారంబించింది అని చెప్పుకొన్నాము.
కాలములో వక ప్రణాళిక (shedule ) ఉంటుంది. ప్రణాళిక నిర్వహణ మాత్రమూ  మాయా శక్తి వలన జరుగుతుంది. ఈరెండు కలిసిన దానినే మనము కాలంగా గుర్తిస్తాము.
దీనినే దైవము అనికూడా అంటాము. (దేవుడు వేరు,దైవము వేరు . please మరిచిపోకండి. )
వక్కసారి ఈ కాలప్రణాళిక రూపొందిన తర్వాత దానిలో మార్పులుచేయుట ఎవ్వరికి సాధ్యముకాదు.
కంసుడు ఎంత బతిమలాడినను ఉగ్రరూపుడై ఉండుట గమనించిన వసుదేవుడు  కాలస్వభావమును స్మరించి ఇట్లు భావించెను. ప్రస్తుతము దేవకీ ప్రాణాపాయస్థితిలో వున్నది. ఆమెను రక్షించుట ప్రస్తుత కర్తవ్యము. ఎనిమిదవ గర్భమున పుట్టిన బిడ్డ వీనిని చంపునని ఆకాశవాణి  పలికిన మాటలు వింటినికదా! అది దైవము యొక్క వాక్కు. (కాలము)
అది జరుగవలెనన్న ఈమె బ్రతికిఉండవలెను. కనుక ఈమెను విడిపించుటకు ప్రయత్నము చేయుట మన కర్తవ్యము ,(I రిపీట్ ) కర్తవ్యము . అని భావించిన వసుదేవుడు "ఈమెకు పుట్టిన బిడ్డలనందరిని తెచ్చి నీకిచ్చదను . ఈమెను వదిలివేయుము. ",అని కంసుని నమ్మించి ,ఒప్పించి భార్యతోకలిసి ఇల్లుచేరేను. ( మిగతా తరువాతి పాఠములో )j
కృష్ణమ్ వందే జగద్గురుమ్ !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి