11, సెప్టెంబర్ 2014, గురువారం

                                       సాధన  -spiritual path

  1.      క్రియ  అంటే  చేయడము . చేయవలసిన  పనుల రూపమయిన అభ్యాసములో ముఖ్యమయినవి మూడు . అందులో  తపస్సు  మొదటిది .. తపస్సంటే  గడ్డాలు  మీసాలు  పెంచడము కాదు .  పెంచితే  తప్పులేదు కాని  పెంచకపోతేనే  మంచిది అన్నాడు మనువు .  తపస్సు అనే మాటకి వేడి అని అర్ధము. మన లోపల ఉన్న దివ్యతేజస్సు  వెలుగుటకు  వేడి పుట్టించుట . ఎలా పుట్టించాలో మనకు మూడు రకాలుగా చెప్పారు .. శారీరక మయిన తపస్సు ,వాక్కునకు సంబందించిన తపస్సు ,మానసికమయిన తపస్సు.    
  2. 2       మానసికమయిన  తపస్సు గురించి కొంచము మాట్లాడుకొందా ము  
  3.           ఇవి నాలుగు రకాలుగా చెప్తారు
  4.          సౌమ్యత్వము (అంటే నాజుకుతనము ), ఆత్మ వినిగ్రహము ,భావసంసుద్ధి (ఎపుడు మనము మాట్లాడినా  పదిమందికి  పనికివచ్చే ది గా   ఉండాలి ),మౌనము . మౌనాన్ని గురించి కొంచము మాట్లాడుకొందాము . 
  5. మౌనము అంటే మాట్లాడటం  మనేయట ము కాదు . అక్కరలేనివి మాట్లాడకుండా ఉండటము . మాట్లాడవలసి రావడము అంటే  అది మనక యినా ఉపయోగించాలి ,ఎదుటివాడి కయినా ఉపయోగించాలి . ఇది  మానసిక మౌనము అంటే . మనము చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి , చేద్దాము అనుకోనేవి కొన్ని ఉన్తాయి. చేద్దమనుకోన్నవి మానేస్తే చేయవలసిన పనులు మనదగ్గరకు వస్తయి. అవి చేస్తే కర్తవ్యము నిర్వహించడము అన్టారు . ఈ రొండు చాతనవడము పేరు మౌనము (Mentalsilence ) .. ఇది  మానసిక లక్షణము . చూచారా ,తపస్సు అని పతంజలి చెప్పిన మాటకి సరిఅయిన అర్ధము ఇది. వాడికి గడ్డము ఉందా ,లేదా అనేటువంటి విషయము కాదు . 
  6. ఇట్లు తపస్సు, స్వాద్యాయము ,ఈశ్వరప్రనిదానము కలిస్తే క్రియాయోగము  అవుతుంది . ఇది సాధనపాదములో మొదటి సూత్రము . 
  7. (ref. MASTER EK PAGES 1to 25)


        

                                                                                                                                                          



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి