11, సెప్టెంబర్ 2018, మంగళవారం

Anthardarshanamu----3

అంతర్దర్శనము ---3విభాగము

మనము ఇప్పటిదాకా  మనస్సు,ఇంద్రియములు,,ఆత్మ(జీవాత్మ)'ప్రాణము,ప్రజ్ఞ (consciousness)
అనే పాదాలకు వివరణ తెలిసికొన్నాము. ఇప్పుడు వీటిద్వారా 'అంతర్దర్శనమునకు 'వక ప్రయత్నము చేద్దాం. దీనికి ముందు కావలసినది 'ప్రాణమును యమించుట'అనే కార్యక్రమము . దీనికి మన రుషులు దర్శించి మనకిచ్చిన వరము  3x9x3 అనే ప్రమాణము .
ఈ సృష్టి లోని  అనంతమయిన ప్రాణమును మనము శ్వాసద్వారా  అందుకుంటూ ఉంటాము. ప్రాణశక్తి యమింపబడాలి అంటే మన శ్వాస నిభద్దము కావాలి . శ్వాస నిభద్దము కావాలి అంటే క్రమబద్ధంగా
శ్వాసను పీల్చుట వదులుట మనం మనసు పెట్టి చేయాలి. అంటే మనస్సును శ్వాసపై లగ్నం చెయ్యాలి.
అంటే మనము గాలి పీల్చుకొనేటప్పుడు (ఉఛ్వాస ,అంటే ప్రాణవాయువు ) అశ్వాసతో మనస్సు లోపలకు ప్రయాణం చేసి ఉఛ్వాస చివరివరకు చేరాల. అక్కడ నిశ్వాస ప్రారంభ మవుతుంది. (అపానము )
ఈ నిశ్వాసను అనుసరిస్తూ మళ్లా  మనసు నిశ్వాస కొనకు చేరాల. మనస్సు శ్వాసతో లగ్నమయి ఉండేటట్లు
పైవిధంగా practice చెయ్యాల. శ్వాస నెమ్మతిస్తే మనస్సు నెమ్మతిస్తుంది.
ఇందుకు ముఖ్యమయినవి అయిదు నియమాలు. :-
(1) శ్వాసను మనసుతో చూస్తూ నెమ్మదిగా పీల్చుట, వదులుట
(2) శ్వాసను దీర్ఘంగా ,పూర్ణంగా పీల్చడం,వదలడం
(3) ప్రతి శ్వాసలోను పైరెండు నియమాలు ఉండేటట్లు చూసుకోవాలి.
(4) వాకశ్వాసకు ఎంతకాలం పడుతుందో తర్వాతి శ్వాసాలకుగూడ అంతేకాలం పట్టాల.
(5) ఇది సాధన చేసేవాడు ప్రతిరోజు ఒకేకాలంలో (కనీసము రోజుకు 3 సార్లు) ఈకార్యక్రమాన్ని నిర్వర్తించాలి

శ్వాసల సంఖ్య క్రమంగా పెంచుకోవాలి. ప్రతి మూడు శ్వాసలు వక మినిమం విభాగము గ పెట్టుకొని మెల్లగా పెంచుకోవచ్చు.   ఇట్లు తొమ్మిది  విభాగములు వక round గా గుర్తుంచుకోవాలి. Contd)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి