ఆనందము --వక పరిశీలన
జీవులందరూ ఆనందము కోసము రకరకాల కార్యాలు చేస్తూ వుంటారు ; అన్వేషణలు సాగిస్తూ వుంటారు . అసలు జీవుడు అంటే నిర్వచనము ఆనందము కొరకు అన్వేషించే వాడని . కొందరికి తినడము ఆనందం;కొందరికి నిద్ర ఆనందం ;మరికొందరికి వ్యర్ధ భాషణము ఆనందం;కొందరికి పుణ్య క్షేత్ర దర్శనం ఆనందం ;ధనార్జన మరి కొందరికి ఆనందం ;పదవి,కీర్తి,స్త్రీ,పురుష వ్యామోహము ఆనందం గా కొందరికి గోచరిస్తాయి . ఇట్లు ప్రయత్నించి,చివరకు పొంది ఆనందిస్తారు . త్రిప్తి చెందరు . మోహంలో పడి మరలా,మరల కోరతారు . చివరకు ఆ ఆనందం తాత్కాలికమే అని తెలిసికొంటారు . పొందని వాళ్ళు క్రోధానికి గురి అవుతారు .. ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు చివరకు ఇది అశా స్వతమని తెలిసికోగలుగుతారు . పైగా ఈ ఆనందానుభూతి వల్ల బంధాలు,రోగాలు ఏర్పడుతున్నాయి అని గమనిస్తాడు .చివరకు దుష్ఫలితాలు లేని ఆనందం కోసం అన్వేషిస్తాడు .
అట్టి ఆనందం దైవస్మరణ,యజ్ఞార్ధ జీవనము,స్వాధ్యాయము,అను మార్గాల ద్వారా కలుగుతుందని తన అన్వేషణలో తెలిసికొంటాడు . తన మార్గాన్ని మార్చుకుంటాడు .
దీనికి కారణము మనము ఆలోచిస్తే ,దైవము పూర్తిగా ఆనంద స్వరూపుడు;జీవుడుకుడా ఆనందస్వరుపుడే
కానీ,మనో దౌర్బల్యం వల్ల దైవముతో విడిపోయి ఆనందాన్ని temporary గా కోల్పోతాడు . మరల దైవాన్ని చేరి ఆనందానుభూతిని పొందుతాడు . ఇది శాశ్వత సత్యము .
ఇదే మనస్సు బుద్ధితో kuudinapudu కలుగు ఆత్మానందం .
"శాశ్వతానందం ఆత్మానుభూతి మాత్రమే "
MASTER CVV NAMASKARAMS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి