నమస్కారములు . rao గారి మొదటి ప్రశ్నకు సమాధానము .
మనస్సు బుద్ధి మన దేహములో ఎక్కడ ఉంటాయి ?1. మనస్సు బుద్ధి అనేవి భవుతికము గా చూడ కలిగేవి కావు. (కన్ను,ముక్కు ,లాగా).
ఇవి ప్రజ్ఞా రూపాలు . brain వేరు మనస్సు వెరు. బ్రెయిన్ ని చూదగలము . సులభము గా అర్థము చేసుకోవాలి అంటే
మనస్సు మన ఆలోచనల పరంపరల సమాహారము . mind is nothing but flow of thoughts.వ్రిత్తి ప్రవాహ ఇతి మనః అని పతంజలి మహర్షి చెప్పారు .
2.మనస్సు, బుద్ధి,చిత్తము, అహంకారము -- ఈ నాలుగు అంతఃకరణ చతుష్టయములు . (ఇన్నర్ instruments ).
మన భవుతిక శరీరము లోపల లింగ శరీరము లేక సూక్ష్మ శరీరము అనే ఇంకొక శరీరము ఉంది . (ASTRALBODY).ఈ శరీరానికి మరణం లెదు. మనిషి చనిపోవడము అంటే physicalbody నసించదమె. astralbody మళా ఇంకో శరీరములోకి ప్రవేశిస్తుంది . దీనికి స్థితి మార్పు తప్ప నాశనము ఉన్దదు. ఈ శరీరానికి సంబందించిన ప్రజ్ఞ లే ఈ innerinstruments ,మనస్సు, బుద్ధి, అహంకారము,చిత్తము. కర్మ సిద్ధాంతము లో ఇవే మన పూర్వ జన్మ వాసనలను సంచితకర్మ రూపములో carry చేస్తూ ఉంటాయి . మన నిద్రలో ప్రయాణించి మరల మన physicalbody లో వచ్చి కూర్చుంటాయి .
మనస్సు యొక్క వ్రిత్తి బెధములె (functionalvariants ) బుద్ధి, చిత్తము,అహంకారము .
mind past ,present ,future లో ప్రయాణిస్తూ ఆలోచనలతో నిండి వుంటే మనస్సు అంటాము .
అదే mind discrimination ,decisionmaking లో నిమగ్నమయి ఉంటె బుద్ధి అంటాము .
మనస్సుకు నాది, నేను,అన్న ఆలోచన వస్తే అది అహంకారము .
అదే మనస్సు సంస్కార వాసనలకు ,memory కి నిలయమయినప్పుడు చిత్తము అంటాము .
మనస్సు ఇంద్రియములతో ఉన్నప్పుడు చుట్టుప్రక్కల పరిసరములతో react అవుతూ వుంటుంది . (objectivemind ). ఇంద్రియములను మనము withdraw చేసుకో కలిగితే ,మనస్సు inward గా travel చేసి (subjectivemind ) బుద్ధితో లయమవుతుంది .. మనస్సు బుద్ధితో లయమవడము యోగము అంటారు . సులభంగా అర్ధము కావాలంటే మనస్సుని,బుద్ధిని వక నాణెము యొక్క రెండు sides అనుకోండి .
మనస్సు బుద్ధితో యోగించాలంటే ,భుద్ధి సంగము దైవము తో వుండాలి . మనస్సును (జ్ఞాన ఇంద్రియాలను ), చేస్తున్నటువంటి పనులపై (కర్మేంద్రియాలు )ఉంచాలి . బుద్ధిని ఎప్పుడు దైవము తో ఉంచుకోవడాని కే దైవస్మరణము ఈయబడినది . అతడే బుద్ధిమంతుడు .
MASTER CVV NAMASKARAMS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి