దశరధుడు అతనిని అర్గ్యపాద్యాదులతో పూజించి ఆహ్వానించాడు. సంతోషించిన విశ్వామిత్రుడు దశరధుని క్షేమసమాచారాలు అడిగి గాయత్రీమంత్రము యొక్క విశిష్టతను తెలిపేటందుకు పూనుకొన్నాడు. అదేసమయంలో వసిష్ఠులవారు వచ్చారు. వసిష్ఠుడు,విశ్వామిత్రుడు కలుసుకున్న శుభసమయములో శ్రీరాముడు అక్కడికి ప్రవేశిస్తాడు. రామ,లక్ష్మణుల దర్శనం జరుగుతుంది. విశ్వామిత్రుడు సూర్యఅంతర్వర్తి అయిన నారాయునినిచూచి తన హృదయంలో ఆధర్మస్వరూపాన్ని ప్రతిష్టించుకొంటాడు. చూడండి!
ఓంకారమే వసిష్ఠుడు ,గాయత్రీమంత్రము విశ్వామిత్రుడు. ఆఇద్దరు కలిసినప్పుడు మాత్రమే రామునిదర్శనము జరుగుతుంది. ఇది 'KEY'. గమనించండి.
మనంకూడా ప్రతిరోజు ఓంకారముతోకూడిన గాయత్రీమంత్రము జపం చేసుకొంటే మనలోనే సహస్రారకమలములో వున్న శ్రీరాముడిని మనం చూడగలుగుతాము. కార్యక్రమానికి రానివాళ్లు ఆవేదన చెందవద్దు. వాల్మీకిమహర్షి మనకిచ్చిన పైసదుపాయాన్ని ప్రయత్నంచేయండి.
దైవదర్శన ప్రాప్తిరస్తు,,!
స్వస్తి!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి