17, జనవరి 2015, శనివారం

10.KARMA SIDDANTHAMULO VAKA PRASNA.....

  10   కర్మ సిద్దాంతము లో  వక ప్రశ్న .....

  సాధకులలో  వకరికి వచ్చిన అనుమానానికి మాస్టారు గారి suggestion  ఇలా వుంది ..
సంచిత కర్మ ,ప్రారబ్ద కర్మ, ఆగామికర్మ .... అని చెప్పుకున్నాము ...
ప్రారబ్దకర్మ అనుభవించక తప్పదు . అంటే accept  చేయక తప్పదు . అయితే వివేకముతో, గురుస్పూర్తి తో ఈ అనుభవాన్ని తగ్గిన్చుకోనవచ్చును . example. ... కడుపు నొప్పి వచ్చింది అనుకోండి . tablet  వేసుకోకుండా  ఉపోషం  వుంటే  nextday కి తగ్గి పోతుంది . గురువు ఈ ఆలోచన ఇస్తాడు .దీన్ని మనము గమనించము .
బలవంతంగా tablet  వేసుకొంటే  temporary  గా తగ్గుతుంది .కాని మళ్ళి  relapse  అవుతుంది . ఇది  తెలిసిగూడా   చాలామంది బలవంతంగా వేసుకొంటారు . దీనికి కారణం  వారి స్వభా వముయొక్క బలము . ఈ స్వభావానికి కారణం పూర్వ జన్మ సుకృతము . ఈ స్వభావము పైకి రాకుండా ,influence  చేయకుండా వుండాలంటే  దైవాన్ని, గురువుని  ఆశ్రయిం చాలి .. .  అప్పుడు ప్రారబ్ద కర్మ  effect  తగ్గుతుంది . ...అంటే గురువు చెప్పింది మనకు మన పరిసరాల ద్వారా  వినబడుతుంది .దయఉంచి  దీన్ని గమనించాలి .  

ఇక పోతే  ఆగామి కర్మ...
మనం  ప్రతిరోజు చేసే పనులలో add  అయ్యే కర్మ ఇది .  మన mind  ఎప్పుడు objectivity  వైపే పనిచేస్తూ వుంటుంది . (ఇంద్రియములు  ఇమ్ద్రియార్ధముల  వైపే పరుగెడుతూ వుంటాయి )
మనము చేయవలసినది వివేకాన్ని ఆశ్ర ఇంచడము . (టచ్ ది intellect ),కర్తవ్యాన్ని రుచికరంగా నిర్వర్తించడము ..
అంటే ఇతరులకు హాని కలుగకుండా వాళ్లకు అవసరమయినది చేసిపెట్టడము . వాళ్ళు కోరుకొన్నది  మాత్రము  కాదు . దయయుంచి దీన్ని గమనిం చండి . ఇట్లా చేస్తే ఆగామి కర్మల నుండి భంధములు  మొలకెత్తవు . తప్పించుకో వచ్చు .
ఇక పోతే  సంచిత కర్మ ... ఇది  మన పూర్వ జన్మల baggage (సంచి )....
ప్రారబ్ద కర్మ , ఆగామి కర్మల  నియంత్రణ వలన (పైన చెప్పినట్లుగా ) సంచిత కర్మ  NEUTRALISE  అవుతుంది .  ( హరించ బడుతుంది ). ...
ప్రస్తుతానికి  దీన్ని  సాధన చేయండి ...
మాస్టర్ CVV  NAMASKARAMS ...




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి