25, మే 2016, బుధవారం

Atmagnanamu---tatvagnanamu

ఆత్మజ్ఞానము 

ఈ సృష్టి లో  ప్రతిదీ మార్పు చెందు చున్నట్లు  కనిపిస్తూ వుంటుంది . ఉదాహరణకు మనలో బాల్యం నుండి 
వృధా ప్యము  వరకు రోజు శరీరములో ఏదో వక మార్పు జరుగుతూ వుంటుంది . కానీ మనము వాటిని గమనించము .. ఇట్లు మార్పుచెందే ఈ సమస్తానికి ' మార్పుచెందని 'వక కేంద్రము వుంటుంది . అది మార్పుచెందు వానిలో మార్పు చెందకుండా వుంటుంది . ఈ కేంద్రము వక ఎనేర్గీగా (energy),ప్రజ్ఞ గా మనలో వుంటుంది . సృష్టిలో కూడా వుంటుంది . దీని ఆధారము గానే పుట్టడము,పెరగడము, లయమవడము సాగుతూ వుంటాయి . ఈ ప్రజ్ఞ నే
ఆత్మ అంటారు . జీవులలో వుండే ఈ ప్రజ్ఞ జీవాత్మ . అదే పరమాత్మ యొక్క ప్రతిబింబము . ఇది జనన మరణములకు అతీతము . చనిపోవడము అనేది శ రీరానికి  కాని ఆత్మకు కాదు . ఇది శాశ్వతము . ఈ  ఆత్మ దర్శనానికి  నిర్దిష్టమయిన సాధన మార్గము  యోగవిద్య .
తత్వ జ్ఞానము నుగుర్చి మరల చెప్పుకుందాము 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి